లూసిఫర్ : చిరు మళ్ళీపాలిటిక్స్ ని టచ్ చేస్తారా?

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాల్లో మలయాళం ”లూసిఫర్” కూడా చేరింది.  తమిళ దర్శకుడు  మోహన్‌రాజ్‌ ని దర్శకుడిగా ఖరారు చేశారు. అయితే  ”లూసిఫర్” కధ చాలా మంది అభిమానుల్లో ఓ చిన్న సందేహం వుంది. ఇప్పటికే మలయాళం వెర్షన్ చూసిన కొందరు మెగాఫ్యాన్స్ ఈ సినిమాని వున్నది వున్నట్లు తీస్తే.. కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి లూసిఫర్ మంచి కధే. అయితే అది మెగాస్టార్ కి ఎంతవరకూ నప్పుతుందా అనేది ఇక్కడ  ప్రశ్న. లూసిఫర్ కధ లాగ్ లైన్ తీసుకుంటే.. ఒక రాష్ట్రాన్ని శాశించగల సత్తా వున్న ఒక పొలిటికల్ గాడ్ ఫాదర్ చనిపోతాడు. అతడి స్థానంను ఎవరు భర్తీ చేస్తారనే బిల్డప్ తో  హీరో పాత్ర ఎంట్రీ. తర్వాత పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా నడుస్తుంది లూసిఫర్ కధ. అయితే ఈ కధలో చాలా వైవిధ్యమైన కోణాలు వున్నాయి.  ఇందులో హీరో పాత్ర.. సినిమా మొదలైన అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తుంది. ఇందులో హీరోయిన్ కి ఛాన్స్ లేదు. ఒక వేళ మెగాడ్యాన్సల కోసం పెడితే మాత్రం హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. ఎందుకంటే లూసిఫర్ లో హీరో క్యారెక్టర్ అలాంటిది.

అంతేకాదు.. ఇందులో విలన్ కి కీ రోల్ వుంటుంది. అయితే ఆ విలన్ డైరక్ట్ గా హీరోతో ఫైట్ చేయడు  హీరో చెల్లిని రెండో పెళ్లి చేసుకుంటాడు. అంతకుముందే ఆ చెల్లి ఓ కూతురు వుంటుంది. ఆ కూతురిని అనుభవించాలని అనుకుంటాడు విలన్. ఇదంతా ఆ ఫ్యామిలీ ఎఫైర్. అంతేకాదు ఇందులో హీరో ఓ నింద మోయాల్సివస్తుంది. ఓ అనాధ పిల్లని గర్భం చేసిన నింద. ఇలాంటి ఇలాంటి ట్రాక్.. వున్న మెగాస్టార్ కధలో వూహించగలమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమౌతుంది.

 ముఖ్యంగా చిరు ఇప్పుడు పాలిటిక్స్ కు దూరంగా వున్నారు. తనకు రాజకీయాలు అచ్చి రావని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన పొలిటికల్ కెరీర్ కి యావరేజ్ మార్కులు కూడ పడలేదు. ఇలాంటి నేపధ్యంలో పాలిటిక్స్ సబ్జెక్ట్ తో రావడం ఒక్కింత రిస్క్ అనే మాట కూడా వినిపిస్తుంది. మొత్తానికి లూసిఫర్ కధలో చాలా మార్పులు చేసి మెగా ఫ్యాన్స్ మెచ్చుకునేలా సినిమాని తయారుచేయడం మేకర్స్ ముందు వున్న అతి పెద్ద సవాల్.