గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచారు

తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు తన పదవికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచారు. అదేంటి అనుకుంటున్నారా..ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా దీనిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. స్పీకర్ కు తన రాజీనామా లేఖను పంపించానని అన్నారు. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని గంటా శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని గంటా శ్రీనివాస్ సూచించారు.