టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ ఓ ఇంటి వాడయ్యాడు. రినీ కంటారియా అనే యువతిని అతడు పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు.
సంప్రదాయ వస్త్రధారణలో భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. దీంతో కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా సౌరాష్ట్ర పేసర్ అయిన జయదేవ్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.