స్టార్ కాస్ట్ : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ తదితరులు..
దర్శకత్వం : మున్నా
నిర్మాతలు: ఎస్వీ బాబు
మ్యూజిక్ : అనూప్
విడుదల తేది : జనవరి 29, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5
బుల్లితెర ఫై యాంకర్ గా యావత్ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రదీప్ మాచిరాజు..ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా ‘ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుకుమార్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన మున్నా ఈ చిత్రం తో దర్శకుడి గా పరిచయమవ్వగా..అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలుశ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా..? ప్రదీప్ హీరోగా సక్సెస్ కొట్టాడా..? అసలు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా ‘ అనేది ఎలా చెప్పారు..? ఇవ్వన్నీ పూర్తి రివ్యూ లో చూద్దాం.
కథ :
స్వాతంత్ర్యం వచ్చే సమయంలో అబ్బాయిగారు(ప్రదీప్ మాచిరాజు), అమ్మాయిగారు(అమృతా అయ్యర్) లకు ఎగేజ్మెంట్ అవుతుంది. కానీ మరుసటి రోజే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి చనిపోతారు. తర్వాత జన్మలో అర్జున్(ప్రదీప్ మాచిరాజు), అక్షర(అమృతా అయ్యర్)గా పుడతారు. ఇద్దరు ఒకే వైజాగ్ లో ఇంజనీరింగ్ చదువుతుంటారు. కానీ ఇద్దరికీ ఒకరంటే..ఒకరికి అస్సలు పడదు. అనుకోకుండా వీరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి అరకు విహారయాత్రకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ అనుకోకుండా ఒకరి శరీరంలో మరొకరు ఆత్మ మారిపోతుంది. ఆ తర్వాత ఏంజరుగుతుంది..? అసలు ముందు జన్మలో ఇద్దరూ మధ్య ఎందుకు మనస్పర్థలు వస్తాయి..? గత జన్మ విషయం వీరికి తెలుస్తుందా..లేదా..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.
ప్లస్ :
- ప్రదీప్ యాక్టింగ్
- సాంగ్స్
మైనస్ :
- డైరెక్షన్
- బోర్ కొట్టించే సీన్స్
- హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు
నటీనటుల తీరు :
- బుల్లితెర ఫై సత్తా చాటుతున్న ప్రదీప్..హీరోగా తనవంతు ప్రయత్నం చేసారు. కామెడీ , ఎమోషల్ సీన్లలో ఓకే అనిపించాడు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించేశాడు.
- అమృతా అయ్యర్ లుక్స్ పరంగా బాగానే ఉంది. ఆత్మలు మారిన సందర్భంలో మగవాడిలా ఆమె చేసిన నటన ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
- పోసాని కృష్ణమురళి, హేమల అనుభవం మరోసారి తెరపై ఆకట్టుకుంది.
- వైవా హర్ష, భద్రమ్ కామెడీ ఇబ్బంది పెట్టింది. హైపర్ ఆది, మహేశ్, శుభలేఖ సుధాకర్ తమ పాత్రలపరిధి మేర నటించారు.
- సాంకేతిక వర్గం :
- అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం సాంగ్ విజువల్ గా కూడా బాగుంది.
- దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ పర్వాలేదు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి. వాటిని కత్తిరిస్తే బాగుండు.
- ఇక డైరెక్టర్ మున్నా విషయానికి వస్తే.. పునర్జన్మల కథ ఎంచుకోని దర్శకుడు మంచి ప్రయత్నమే చేశాడు. కానీ ఆ కథని తెరపై చూపించడంలో తడబడ్డాడు. రెండు కాన్సెప్ట్‌లను కలిపి కథగా రాసుకున్నప్పటికీ అందులో లాజిక్ లేని సన్నివేశాలు బోర్ కొట్టించాయి. సినిమాలో హీరో , తన తల్లిని ఎందుకనో తీవ్రంగా ద్వేషిస్తుంటాడు. అందుకు సరైన కారణాన్ని దర్శకుడు వివరించలేదు. అలాగే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ అయ్యేవిధంగా అనిపించవు. సీరియస్ కథ అయినా.. కామెడీతో నడిపించేప్రయత్నం చేసి కాస్త విఫలమయ్యాడు.
ఫైనల్ గా :
ప్రమోషన్ చేసినంత సినిమాలో మ్యాటర్ లేదు..జస్ట్ నీలి నీలి ఆకాశం తప్ప..