చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా.. గొప్ప విజయం

టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది

మూడో సెషన్‌లో టీమ్‌ఇండియా విజయానికి 144 పరుగులు చేయాల్సి ఉండడంతో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. పుజారా, పంత్‌ ఆ విధంగానే ఆడారు. వారిద్దరూ వికెట్‌ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే, జట్టు స్కోర్‌ 228 పరుగుల వద్ద పుజారా నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే మయాంక్‌ అగర్వాల్‌ (9) స్వల్ప స్కోరుకు పెవిలియన్‌ చేరాడు. అప్పటికి టీమ్‌ఇండియా 265/5 స్కోర్‌తో నిలిచింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే భారత్‌ విజయానికి 62 పరుగులు అవసరమైన వేళ పంత్‌తో జోడీకట్టిన వాషింగ్టన్‌ సుందర్‌(22 ) ధాటిగా ఆడాడు. పంత్‌ సైతం బౌండరీలు బాదడంతో టీమ్‌ఇండియా విజయానికి చేరువైంది.  పంత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 369 ఆలౌట్‌
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 336 ఆలౌట్‌

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 294 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 329/7