బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిని చంచలగూడ జైలు కు తరలించారు. ఏ2గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ1గా చేర్చారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు.
వీరితోపాటు అఖిలప్రియ భర్త భార్గవరాం ఏ3గా ఉన్నారు. శ్రీనివాస్‌చౌదరి, సాయి, చంటి, ప్రకాశ్ సహా మరికొందరిని నిందితులుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అఖిలప్రియకు చంచల్‌గూడ జైలు అధికారులు యూటీ ఖైదీ నంబర్ 1509 ని కేటాయించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నదని, ఎలాంటి స్పెషల్ క్యాటగిరీ కేటాయించలేదని తెలిపారు.
ఈ కిడ్నాప్‌కు హపీజ్పేట్లోని భూ వ్యవహారమే కారణంగా తేలింది. భూమా నాగిరెడ్డి హయా నుంచి ఈ భూ వివాదం కొనసాగుతోంది. భూమి అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి సోదరుడు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల ప్రియ, ఆమె భర్తపై పోలీసులకు ప్రవీణ్ రావు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడం తో ఆ పిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి వారిని అరెస్ట్ చేసారు.