హైదరాబాద్ మెట్రో మళ్లీ మొరాయించింది. ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం కారిడార్లలో సాంకేతిక సమస్యలు రావడంతో ఎక్కడిక్కడే ట్రైలు ఆగిపోయాయి. దాదాపు 30 నిమిషాలుగా మెట్రోలను నిలిపివేశారు అధికారులు.. దీంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో.. ఉద్యోగులు, ఇతర పనులపై వెళ్లేవాళ్లు మెట్రోలో చిక్కుకుపోయారు. 20 నిముషాలు పాటు మెట్రో రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా పలుసార్లు ఇలాగే మెట్రో రైలు నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై మెట్రో అధికారులు ఇంకా స్పందించలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.