భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో గంగూలీని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత గంగూలీని డిశ్చార్జ్ చేయనున్నారు.
ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. జనవరి 10 నుంచి ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి ఏర్పాట్లని సమీక్షిస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి దేశవాళీ టోర్నీ కావడంతో.. మ్యాచ్‌ల నిర్వహణని బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ.. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1,349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్ 10 వికెట్లని సౌరవ్ పడగొట్టడం విశేషం.