పవన్ ఉగాది కానుక!

pavankalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా ఈ నెల 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఖరీదైన ఇంటి సెట్ ని వేసారట. దీనికోసం 3కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ డిజైన్ చేశారు. సమంతా, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కీలకపాత్ర పోషించనున్నారు. ‘జల్సా’ సినిమా తరువాత పవన్ – త్రివిక్రమ్ – దేవిశ్రీ కాంబో లో వస్తున్నా ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి.