మంత్రి కిరోసిన్ తాగేస్తున్నారు..!

dk arunaమంత్రి డీకే అరుణ పేదలకు అందాల్సిన నీలి కిరోసిన్ ను అక్రమంగా క్రషర్ కు తరలిస్తున్నారని తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై.. నాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం నాగం విలేకరులతో మాట్లాడుతూ… నీలి కిరోసిన్ అక్రమవాడకంపై మంత్రి డీకే అరుణ నైతిక బాధ్యత వహిస్తూ… మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే మంత్రిమండలి నుంచి తక్షణమే ఆమెను ముఖ్యమంత్రి తొలగించాలని డిమాండు చేశారు. కాగా, తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదన్న ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టీస్ కట్జూ మాటలను నాగం ఖండించారు. తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. వెంటనే కట్టూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నాగం డిమాండు చేశారు.