ఇక ఫై రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చు – కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రైతులు ఇక ఫై మీకు నచ్చిన పంట వేసుకోవచ్చని తెలిపాడు సీఎం కేసీఆర్. ఇకపై నియంత్రిత సాగు విధానం లేదని తెలిపారు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

కేసీఆర్‌ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం నియంత్రిత సాగుపై నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు పంటలు ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో…అక్కడే అమ్ముకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.