ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. కాకపోతే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి భారీగా తగ్గిందని సంబరపడాలో లేక కొత్త వైరస్ స్ట్రెయిన్ ఏపీలో అడుగుపెట్టిందని భయపడాలో అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో రోజు రోజుకు కేసుల సంఖ్య బాగా తగ్గుందని అంత అనుకుంటున్నా సమయంలో యూకే నుండి వచ్చిన వారిలో కొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు బయట పడడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇదిలా ఉంటె శనివారం రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులిటిన్ విడుదల చేసింది.

కరోనా వైరస్ కేసులు అత్యల్ప స్థాయిలో నమోదయ్యాయి. అయితే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గించడం వల్లే కరోనా కేసులు ఇంత తక్కువ స్థాయిలో నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే కరోనా మరణాలు సైతం పడిపోయాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 42,911 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 282 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,80,712కి చేరింది. శనివారం కరోనా మహమ్మారి బారిన ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,092కు చేరింది.