శ్రుతి చేతిలో మరో బ్రాండ్

shruti-hassan-is-new-brand-ambassador-for-american-swanగబ్బర్ సింగ్ హిట్ తర్వాత శ్రుతి హసన్ కెరీర్ చాల బిజీగా మారిపోయింది. ఎంత బిజీ అంటే కమల్ కు కుడా డేట్స్ ఇవ్వలేనంత బిజీ. ఇప్పుడు ఈ అమ్మడు చేతికందిన ఏ అవకాశం వదలటం లేదు. ఒక వైపు సినిమాల్లో బిజీ గా వుంటూనే, మరో వైపు వ్యాపార ప్రకటనలలో కుడా మెరుస్తుంది. ఇప్పటికే కళాంజలి, కార్నెట్టో బ్రాండులకు ప్రచారకర్తగా పనిచేస్తున్న శృతి, తాజాగా ఓ అమెరికన్(అమెరికన్ స్వాన్, వరల్డ్ ఆన్ లైన్ ఫ్యాషన్ సంస్థ లైఫ్ స్టైల్ ) బ్రాండుకి కూడా సంతకం చేసింది. ఈ విషయన్ని శ్రుతి ట్విట్టర్ లో పోస్ట్ పోస్ట్ చేసింది. ఈ సంస్థ శ్రుతి ని ఎంపిక చేసుకోవడం గురించి సి.ఈ.వో మాట్లాడుతూ “యువతలో బాగా క్రేజ్ వున్నా స్టార్ ని ప్రచారకర్తగా తీసుకోవాలనుకున్నాం. ఆ క్రమంలో శృతి హాసన్ అన్ని విధాల మాకు సరిపోయింది’ భావిస్తున్నాం అని
తెలిపారు.