మేడ్చల్ జిల్లాలో దారుణం : బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఏఎస్సై

కాపాడాల్సిన పోలీసులే..నేరాలకు పాల్పడుతుంటే ప్రజలు తమ గోడును ఎవరికీ చెప్పుకోవాలి. దేశంలో రోజు రోజుకు ఆడవారిపై , అభం శుభం తెలియని బాలికల ఫై అత్యాచారాలు పెరుగుతుండగా..తాజాగా మేడ్చల్ జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన పోలీస్ అధికారి విషయం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లు సెబాస్టియన్ అనే వ్యక్తి ఓ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడే వాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఏఎస్సై సెబాస్టియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసి రిమాండ్‌కు తరలించారు.