భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్’ ఆర్టీజీఎస్ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇది డిసెంబరు 14 నుంచి 24*7 అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఇప్పటికే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్-NEFT 24 గంటలు అందుబాటులోకి తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇప్పుడు ఆర్టీజీఎస్ సేవల్ని కూడా 24 గంటలు అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో ప్రపంచంలో ఆర్టీజీఎస్ సేవల్ని నిరంతరాయంగా అందిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అవుతుందని ఆర్బీఐ తెలిపింది.