ఛార్జీలు తగ్గించారు..!

cm-kiran-review-on-power-cuరాష్ర్టంలో గత కొద్దికాలంగా విద్యుత్ ఛార్జిల పెంపుపై ప్రతిపక్షాల చేసిన ఆందోళనలకు ఫలితం లభించింది. గురువారం రాత్రి ఉపసంఘంతో సమీక్ష అనంతరం సీఎం కిరణ్ చేసిన ప్రకటనతో పెరిగిన ఛార్జీల నుంచి రాష్ట్ర ప్రజలకు ఊరట లభించింది. నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ వాడుకునే వినియోగదారులకు పాత ఛార్జిలనే కొనసాగిస్తున్నట్లు సీఎం కిరణ్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై రూ.830 కోట్ల భారం పడనుంది. ఆ భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించి, డిస్కమ్ లకు చెల్లించనుంది. తద్వారా 1.80 కోట్ల మంది గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. కరెంట్ కోతలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎక్కడా విఫలం కాలేదని..నవంబర్, డిసెంబర్ నాటికి కరెంట్ కష్టాలు తీరే అవకాశం వుందంటున్నారు అధికారులు