ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 11,103 మందికి వరద సహాయం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం నాడు 11 ,103 మందికి వరద సహాయంగా రూ. 11 .10 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.  మంగళ, బుధ వారాల్లో 17 ,333 మందికి రూ. 17 .33 కోట్లను అందించగా,   నగరంలో  ఇప్పటి వరకు గత మూడు రోజులుగా  28 ,436 మందికి రూ. 28 .44 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకులలో జమ చేశారని వెల్లడించింది.