ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ఇన్నింగ్స్ నిర్ణీత సమయంలో ఒక ఓవర్ ఆలస్యంగా పూర్తిచేయడంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, అబూడ్, టీవీ అంపైర్ పాల్ రీఫెల్, ఫోర్త్ అంపైర్ సామ్ ఫిర్యాదు మేరకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
‘‘ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటుని అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది.