కంగారులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టీ 20 సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈరోజు సిడ్నీలో జరిగిన మ్యాచ్లో ఆసీస్ పై ఆరు వికెట్ల తేడాతో జయ కేతనం ఎగరేసింది. దాంతో టీ 20 భారత్ వశమైంది.
తొలుత బ్యాట్ చేసినియా ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లకు 194 పరుగులు చేసి, భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచారు. భారత ఓపెనర్లు రాహుల్ (30), ధావన్ (52) శుభారంభం అందించడంతో…. పరుగుల వేట ధాటిగానే ప్రారంభమైంది. వీరిద్దరూ తొలి వికెట్ కి 56 పరుగుల భాగస్వామ్యం అందించారు.
కోహ్లీ (22 బంతుల్లో 42) కూడా రాణించడంతో.. భారత్ సులభంగానే టార్గెట్ అందుకుంటుందనిపించింది. అయితే స్వల్ప వ్యవధిలో కీలకమైన వికెట్లు కోల్పోవడంతో.. భారత్ పై ఒత్తిడి పెరిగింది. అయితే… సూపర్ ఫామ్ లో ఉన్న పాండ్య (22 బంతుల్లో 42) మరోసారి విజృంభించడంతో మరో రెండు బంతులు ఉండగానే.. విజయాన్ని అందుకుంది.