ఫైజర్ ముందడుగు

అమెరికా సంస్థ ఫైజర్‌, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అనంతరం ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి బహ్రెయిన్ కూడా ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగం కింద ఆ దేశాలు ఆమోదం తెలిపాయి.

ఈ వ్యాక్సిన్‌ సురక్షితమని బ్రిటన్‌ సంస్థ ‘మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ’ ఇటీవలే తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా ఆ రెండు దేశాల మార్గంలోనే నడుస్తోంది. దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఫైజర్, భారత ఔషధ నియంత్రణ జనరల్‌ ని కోరింది. భారత్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం.