నివర్ తుఫాను గండం గడిచిందో లేదో మరో తుఫాన్ గండం మొదలైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన బురేవి తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడు రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలపై పడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రైతులు పలు తుఫాన్ ల కారణంగా తీవ్రంగా నష్టపోగా…ఇప్పుడు ఈ తుఫాన్ తో కోలుకోకుండా అయ్యింది.
ప్రస్తుతం బురేవి తుఫాన్ ఎఫెక్ట్‌తో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంలో మాడవీధులు, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. దీంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లపై కొండచరియలు, వృక్షాలు పడే అవకాశమున్న చోట్ల అధికారులు నిఘా పెట్టారు.