ఏపీ అసెంబ్లీ : 4 వ రోజు కూడా టీడీపీ తీరు మారలేదు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. మూడో రోజు 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్..4 వ రోజు కూడా అలాగే చేసాడు. పెన్షన్ల ఫై సభ లో గందరగోళం నడుస్తుండగా..తెలుగుదేశం నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. 8మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో అచ్చెన్నాయడు, రామకృష్ణబాబు, మంతెన రామరాజు, సత్యప్రసాద్, వీరాంజనేయులు, బెందాళం అశోక్, జోగేశ్వరరావు ఉన్నారు.