బండి సంజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్..

దేశ వ్యాప్తంగా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. రాజకీయ నేతల నుండి తెలుగు రాష్ట్రాల ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే అధికారులు పోలింగ్ కు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇదిలా ఉంటె తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫై సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కొందరు పోలీసు అధికారులే ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారంటూ బండి సంజయ్ కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్ ఫై సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. పోలీసులపై బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని సంజయ్‌కు సీపీ చురకలంటించారు. సంజయ్‌పై లీగల్ ఒపీనియన్‌కు వెళ్తున్నామని, కేసులను పక్కాగా నమోదు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ.. నేరుగా నేతలు ఇంకో పార్టీ స్థావరాలపై దాడులకు దిగడం సరికాదని సీపీ చెప్పారు.