దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు : ముందంజలో బిజెపి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభకావడంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలపై ఒక్కసారిగా వాడీవేడి చర్చ జరుగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే దుబాక లో ఉప ఎన్నికలు జరిగాయి. దీని ఫలితాలు కూడా ఈరోజు రాబోతున్నాయి.

లెక్కింపు మొదలైనప్పటి నుండి కమలం జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన నాల్గు రౌండ్లలోకూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ కొత్త ప్రభాకర్ స్వగ్రామంలో బీజేపీ 110 ఓట్ల లీడ్‌ కనబర్చింది. 1185 ఓట్ల ఆధిక్యంలోబీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దూసుకెళ్తున్నారు. నాల్గవ రౌండ్‌లో మిరుదొడ్డి మండలంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో బీజేపీ 9223 ఓట్లు, టీఆర్ఎస్‌ 7964 కాంగ్రెస్‌ 1931 ఓట్లు సాధించాయి. మరోవైపు రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం కనబరుస్తున్నారు.