తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం మళ్లీ పెరుగుతుంది. గత రెండు వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1602 కేసులు నమోదుకాగా, కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,47,284 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం మరణాల సంఖ్య 1366కి చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,26,646 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,272 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వారిలో 16,522 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణాలో రికవరీ రేటు 91.65% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 92.3% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.55%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 46,970 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 45,31,153 పరీక్షలు చేయడం జరిగింది. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 295 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 137, రంగారెడ్డి జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి.