రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు అన్ని సర్కిళ్లలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేసిన అనంతరం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, విరిగిపడిన చెట్ల కొమ్మలు, నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను పూర్తిగా తొలగించి నగరాన్ని పరిశుభ్రంగా చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డి.ఎస్.లోకేశ్ కుమార్ లతో కలిసి శానిటేషన్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ….పారిశుధ్య పనులను పూర్తిచేసిన వెంటనే ఎంటమాలజి విభాగం ద్వారా క్రిమీ సంహారకాల స్ప్రేయింగ్ చేయించాలని సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో సాధారణ స్థితిని తీసుకువచ్చేందుకు, అంటు వ్యాధులను నివారించుటకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీలో ఉన్న చెత్తను ఇతర వ్యర్థాలను తొలగించక ముందు, తర్వాత మొబైల్ యాప్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి 15 మీటర్లను మొబైల్ యాప్ లో తీయవచ్చునని తెలిపారు. తొలగించిన చెత్తను ఎప్పటికప్పుడు నిర్దేశిత కేంద్రాలకు తరలించుటకై ప్రస్తుతం ఉన్న 242 వాహనాలకు అదనంగా 536 వెహికిల్స్ ను తాత్కాలికంగా తీసుకొని మొత్తం 778 వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను మానిటరింగ్ చేసేందుకు మొబైల్ యాప్ ను రూపొందించినట్లు తెలిపారు. నగరంలోని 5,733 కాలనీలలో శానిటేషన్ డ్రైవ్ ను పకడ్బందీగా నిర్వహించుటకు ప్రతి సర్కిల్ కు ఒక సూపర్ వైజర్ ఆఫీసర్ ను, 960 మంది టీమ్ లీడర్లను నియమించినట్లు తెలిపారు. వ్యవస్థాపరంగా వాహనాలు, టీమ్ లు, ఇతర సిబ్బందిని ఆయా కాలనీలకు బాద్యులుగా నియమించి, 960 మంది టీమ్ లీడర్లు మొబైల్ యాప్ లో లాగిన్ కావాలని తెలిపారు.
Home వార్తలు తెలంగాణ వార్తలు జిహెచ్ఎంసి పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ముమ్మరం – మేయర్ బొంతు రామ్మోహన్