‘బలిదానాలు’ కావు.. ఆనారోగ్య కారణాలు..!

renuka-chowdary‘డేరింగ్ అండ్ డాషింగ్’ నాయకురాలిగా పిలవబడే ఖమ్మం ఎంపీ ‘రేణుకా చౌదరి’ మరోసారి సున్నితమైన తెలంగాణ అంశంపై వివాదాస్ప వ్యాఖ్యలు చేసింది. సోమవారం ఢీల్లీలో రేణుకా విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్నవి, జరిగిన ఆత్మహత్యలు ఆత్మబలిదానాలు కావని.. వివిధ అనారోగ్య కారణాలచేత మరణించారని వాటినే తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగకుండా.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ పేరుతో దందా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ రాకపోవడానికి అసలు కారణం కేసీఆరేనని ఆమె పేర్కొంది. తెలంగాణ పేరుతో కేసీఆర్ అందరిదగ్గరా డబ్బులు గుంజుతున్నాడు` అని రేణుక ధ్వజమెత్తారు.

కాగా, రేణుకా చౌదరి వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ, తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఈ వివాదాస్ప వ్యాఖ్యలపై.. తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పీసీసీ అధ్యక్షుడు బొత్ప సత్యనారాయణ వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు బొత్సను కలిసిన ఆయన తెలంగాణ ఉద్యమాన్ని అవమాన పరిచేలా రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారంటూ బాధపడ్డారు. ఆమె వ్యాఖ్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని బొత్సను ఆయన కోరారు. రేణుకా..  తెలంగాణ వంటి సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు  నోటిని అదుపులో పెట్టుకోవాలని సొంత పార్టీ నేతలే  అంటున్నట్లు సమాచారం.