విద్యుత్.. ఉచితమే : రఘువీరా

raghuveera-reddyరైతాంగానికి కచ్చితంగా రోజుకు ఏడుగంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై.. ఈఆర్ సీ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో.. మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈఆర్ సీ ప్రతిపాదనలు ఫైనల్ కాదని,  ప్రతిపాదనలపై సమీక్షించి పేదలపై భారం పడకుండా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రెండు పంటలకైనా మూడు పంటలకైనా సరే ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం విపక్షాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ అంశంమీద రాద్దాంతం చేస్తున్నాయనీ, దీనికి ప్రజల మద్దతులేదనీ ఆయన అన్నారు. 2004లో కాంగ్రెస్ చేపట్టిన విద్యుత్ ఉద్యమంలో.. లక్షలాది మంది ప్రజలు పాల్గొంటే.. ఇప్పుడు ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలలో ఆయా పార్టీల నేతలే పాల్గొంటున్నారని రఘువీరా చెప్పుకొచ్చారు.