నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోల్ అవ్వగా.. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు వచ్చాయి. పది ఓట్లు చెల్లబాటు కాలేదు. ముందు నుండి కవిత విజయం ఖరారు అని భావించిన నేతలు అనుకున్నట్లే కవిత విజయం సాధించడం తో సంబరాలు చేసుకున్నారు.
గురువారం కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసమండలి దర్బార్ హాల్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.