గుణశేఖర్ తన కలల సినిమా రుద్రమదేవి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. రోజుకో… కొత్త పాత్ర ఈ సినిమాలో చేరుతూ వస్తోంది. మసాలా కూడా ఆయన బాగానే దట్టిస్తున్నారు. ఈ సినిమాలో శృంగారభామ నథాలియా కౌర్కీ స్థానం దక్కింది. నథాలియా రాజకుమారిగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం గుణశేఖర్ చాలా మంది పేర్లు పరిశీలించాడట. చివరికి నథాలియాని ఎంపిక చేసుకొన్నారు. శృంగారం, రాజసం కలబోసిన పాత్రలో నథాలియా కనిపించనుంది. ఈ సినిమాతో నథాలియా… తెలుగులో సుస్థిర స్థానం దక్కించుకోవడం ఖాయం… అని గుణశేఖర్ చెబుతున్నారు. అన్నట్టు భాయ్లో నథాలియా ఓ ప్రత్యేక గీతంలో మెరవబోతోంది. తెలుగులో ఈ భామ పంట పండినట్టే.