నేటి నుంచి విజయమ్మ ‘నిరసన దీక్ష’

Vijayammaరాష్ట్ర ప్రజల ఆగ్రహావేశాలను ప్రతిఫలిస్తూ.. కరెంట్ పోరు క్రమంగా పదునెక్కుతోంది. చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు తమ ఆందోళనను రోజురోజుకూ ఉధృతం చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంట్ కోతలకు నిరసనగా.. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. హైదరబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ లో నేటి నుంచి చేపట్టబోయే నిరసన దీక్షలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది.

విద్యుత్ సమస్యలపై ఇప్పటికే తెలుగుదేశంపార్టీ, వామపక్షాలు నిరసన దీక్ష చేపట్టగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. కాగా విద్యుత్ చార్జీలు పెంచితే ఇంతగా వ్యతిరేకత వస్తుందని ఊహించనటువంటి సీఎం కిరణ్ కు ప్రతిపక్షాల నుండే కాకుండా స్వంత పార్టీనుండే వ్యతిరేక ప్రారంభమైంది. మరోవైపు విపక్షాల కరెంటు ఉద్యమాలు సోమవారం మరింతగా జోరందుకున్నాయి. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో 10 వామపక్ష పార్టీలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపాయి. ’ఇది ఆరంభం మాత్రమే. ప్రజా ఉద్యమాలతో తడాఖా చూపుతాం. ఏప్రిల్ 9న జరిపే బంద్తో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాం’అని హెచ్చరించాయి.