నాన్న బాగానే వున్నారు: శివాత్మిక


రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వస్తోన్న వదంతులు నమ్మొద్దని ఆయన చిన్న కుమార్తె శివాత్మిక ట్వీట్‌ చేశారు. కొన్నిరోజులుగా రాజశేఖర్‌ కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం శివాత్మిక తన తండ్రి ఆరోగ్యం గురించి అందరికీ తెలియజేస్తూ కొన్ని ట్వీట్లు పెట్టారు.

‘కొవిడ్‌ నుంచి కోలుకునేందుకు నాన్న పోరాటం చేస్తున్నారు. మీ అభిమానం, ప్రార్థనలు, ఆశీస్సులే.. మమ్మల్ని రక్షిస్తున్నాయని నమ్ముతున్నాం. కరోనా నుంచి నాన్న వేగంగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రార్థనలతో ఆయన కోలుకుని తిరిగి వస్తారు’ అని  శివాత్మిక ట్వీట్‌ చేశారు.