కత్తి కార్తీక మీద కేసు నమోదు

దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన యాంకర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తా అని కార్తీక, ఆమె అనుచరులు అంటూ కోటి రూపాయల మోసానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మద్య వర్తిత్వం చేసినట్టు సమాచారం. బాధితుడి దగ్గర కోటి రూపాయలు కార్తీక రెడ్డి, అనుచరులు కలిసి సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కత్తి కార్తీక.. తన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని ఆమె కోరుతున్నారు.