నాగ్ వాన పాటకు అల్లరి స్టెప్స్

allari-nareshఅల్లరి నరేష్, సుదీప్, వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రలలో అనిల్ సుంకర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యాక్షన్’ 3డి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం నాగ్-అమల జంటగా నటించిన ‘ప్రేమ యుద్ధం’ చిత్రంలోని ‘స్వాతి ముత్యపు జల్లులలో … ‘ అనే ఓ సూపర్ హిట్ వాన పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను అల్లరి నరేష్ పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో హంసలేఖ ట్యూన్ చేసిన ఈ పాట ఇప్పటికీ వాన పాటల్లో ముందుంటుంది. ఈ పాటంటే నరేష్ కి చాల ఇష్టమట. అందుకే ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఓ భారీసెట్లో ఈ పాటను చిత్రీకరణ చేయబోతున్నారు. ఈ చిత్రానికి బప్పా, బప్పీలహరి సంగీతం అందిస్తుండగా, యువ సంగీత దర్శకుడు తమన్ రీరికార్డింగ్‌తో పాటు ఓ పాటకుమ్యూజిక్ అందిస్తున్నాడు.