ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వందేళ్ల రికార్డు ను బ్రేక్ చేసింది. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ భారీ వర్షానికి నగరంలో పలు సంఘటనలతో 15 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు పడవలు సైతం రోడ్డెక్కాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముసా పేట మెట్రో స్టేషన్ కింద రోడ్డు కుంగింది.
భారీగా వరద రావడంతో పాటు… పిల్లర్ కోసం తీసిన గోయ్యు కారణంగా .. రోడ్డు కుంగిపోయింది. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారి కేడ్ ఏర్పాటు చేశారు. భారీ గుంత పడటంతో ప్రజలు భయపడుతున్నారు. అయితే, మెట్రోకు ఇబ్బంది లేదని… గతంలో తవ్వి, రోడ్డు వేసిన చోట కుంగిపోయిందే తప్ప మెట్రోకు వచ్చిన ఇబ్బందేమీ లేదంటున్నారు అధికారులు.