రచయితలు మెగాఫోన్ పట్టుకోవడం ఈమధ్య ఎక్కువైంది. వాంటెడ్ తో బీవీఎస్ రవి దర్శకుడయ్యాడు. మిర్చితో కొరటాల శివ కూడా మెగాఫోన్ పట్టుకొన్నాడు. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి మరో రచయిత సిద్ధమవుతున్నాడు. ఆయనెవరో కాదు… వక్కంతం వంశీ. కిక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించింది ఈయనే. ఇప్పుడు స్టార్ట్, కెమెరా, యాక్షన్ చెప్పబోతున్నాడు. ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నారట. ఊసరవెల్లి సమయం నుంచీ వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పటి నుంచే ఓ సినిమా చేద్దామని ఇద్దరూ అనుకొన్నారట. అది ఇంతకాలానికి నెరవేరేలా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.