నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో గెలిచారు. పోలైన మొత్తం 823 ఓట్లలో 728 ఓట్లు కవితే దక్కాయి. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి వంద ఓట్లు కూడా రాలేదు.
కవిత గెలుపుతో ఇప్పుడు .. ఆమెకు మరో ప్రాధాన్య పదవి దక్కబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు దక్కబోయే కీలక పదవి ఏమిటన్నదానిపై చర్చ జరుగుతోంది. మంత్రి పదవి ఇస్తారా లేకపోతే మరొకటా అన్నదానిపై జరుగుతుంది.