మరో ఛార్జిషీట్..!

jaganవైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ ఈరోజు (సోమవారం) మరో అభియోగపత్రం (ఛార్జిషీట్)ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ, సాక్షులు అందరినీ పిలిచి విచారించి వారి వాగ్మూలం నమోదు చేస్తోంది. దీనితో భాగంగానే ప్రభుత్వ మాజీ సలహాదారు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మబంధువు కేవీపీని ఇటీవల విచారించింది. ఈ కేసులో జగన్ కు సంబంధించిన వ్యవహారం.. అంతా తాజా ఛార్జిషీట్ లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకవేళ కేసు దర్యాప్తు కొనసాగినప్పటికీ అందులో మిగతా విషయాలు తప్ప జగన్ కు సంబంధించిన అంశాలేవీ ఉండే అవకాశం ఉండదన్నమాట. జగన్ కేసులో సీబీఐ ఇప్పటివరకూ నాలుగు అనుబంధ ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఈ రోజు మరో ఛార్జీషీటు దాఖలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఛార్జీషీటు దాఖలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఫైనల్ ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈరోజు దాఖలు చేసే ఛార్జీషీట్, ఫైనల్ ఛార్జీషీట్ ముందు దాఖలు చేయనున్నది కావడంతో.. సీబీఐ పక్కా ప్లానింగ్ తో ఉచ్చుబిస్తుందని సమాచారం.