వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని పవన్ ట్వీట్

దేశంలో కరోనా ఉదృతి ఏ స్థాయి లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు , మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా దేశ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు దీనిబారిన పడ్డారు. వెంకయ్య నాయుడు కరోనా బారినపడడం తో ప్రతి ఒక్కరు ఆయన క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు , జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసాడు.

“మన భారత దేశ – గౌరవ ఉప రాష్ట్రపతి ‘శ్రీ వెంకయ్య నాయుడుగారు ‘ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను.” అని ట్వీట్ చేసి తన స్పందనను తెలియజేసారు.

మన భారత దేశ –
గౌరవ ఉప రాష్ట్రపతి ‘శ్రీ వెంకయ్య నాయుడుగారు ‘ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను.?@VPSecretariat— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2020