తెలంగాణ కరోనా బులిటిన్ అప్డేట్ : 2,137 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,137 కొత్త కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందినట్లు బులిటిన్ లో తెలిపారు. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306 కు చేరగా.. మృతుల సంఖ్య 1,033కు చేరింది. వైరస్‌ బారినపడిన వారిలో 2,192 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,71,306 మంది కరోనా బారినపడగా 1,39,700 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,573 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 322, ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 51, జగిత్యాల్‌ 42, జనగాం 34, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్‌ 27, కామారెడ్డి 60, కరీంనగర్‌ 132, ఖమ్మం 90, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 28, మహబూబాబాద్‌ 72, మంచిర్యాల్‌ 38, మెదక్‌ 28, మేడ్చల్ మల్కాజ్‌గిరి 146, ములుగు 15, నాగర్‌ కర్నూల్‌ 37, నల్గొండ 124, నారాయణ్‌పేట్‌ 9, నిర్మల్‌ 24, నిజామాబాద్‌ 72, పెద్దంపల్లి 48, రాజన్న సిరిసిల్ల 57, రంగారెడ్డి 182, సంగారెడ్డి 65, సిద్ధిపేట్‌ 109, సూర్యాపేట 61, వికారాబాద్‌ 29, వనపర్తి 29, వరంగల్‌ రూరల్‌ 24, వరంగల్‌ అర్బన్‌ 90, యాద్రాది భువనగిరి 35 కేసులు నమోదయ్యాయి.