ఏసీబీ వలలో అవినీతి తిమిగలం..

తెలంగాణ రాష్ట్రంలో వరుస పెట్టి అవినీతి తిమిగలాలు ఏసీబీ వలలో పడుతున్నారు. ఇప్పటికే కీసర తాసీల్దార్ వార్తల్లో నిలుస్తుండగా..ఇప్పుడు ఆయనను మించిన లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌. నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్‌వోసీ కోసం రూ.1.12 కోట్లు డిమాండ్‌ చేశారు. రూ.1.12 కోట్ల డీల్‌లో భాగంగా నగేష్‌ రూ.40లక్షలు అడ్వాన్స్‌ తీసుకుంటుండగా ఏసీబీ బృందం పట్టుకుంది.

మాచవరంలోని నగేష్‌ ఇల్లు సహా 12 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నగేష్ భార్యను ఏసీబీ అధికారులు బోయిన్‌పల్లికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. రెండు గంటలుగా నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.