కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విలయతాండవం చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,392 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తాజా హెల్త్ బులిటిన్ లో తెలిపారు .
ఈ కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,163కు చేరాయి. అలాగే కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 11 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లా వారీగా కేసులు ఈ కింది పట్టికలో చూడవచ్చు.