తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు..

తెలంగాణ కేబినెట్ సమావేశం పూర్తి అయ్యింది. దాదాపు రెండు గంటలపైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి అంటే..

  • కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం
  • ఎల్లుండి అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • మున్సిపల్ యాక్ట్-2019 సవరణ బిల్లకు కేబినెట్ ఆమోదం
  • తెలంగాణ జీఎస్టీ యాక్ట్‌-2017లో సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం
  • తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్‌ అమెండ్మెంట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం
  • డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం
  • టీఎస్ బిపాస్ బిల్లును ఆమోదించిన మంత్రవర్గం
  • ఆయుష్ కాలేజీ అధ్యాపకుల పదవీవిరమణ వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్‌కు ఆమోదం
  • 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులకు ఆమోదం
  • సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించి పరిపాలనా అనుమతులను ఆమోదించిన కేబినెట్
  • కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.