ఏపీలో కరోనా ఉదృతి ఎలా ఉందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో చేస్తుండడం తో పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతూ వస్తున్నాయి. గత రెండు వారాలుగా ప్రతి రోజు పదివేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా..సోమవారం మాత్రం కాస్త కేసులు తగ్గి ప్రజలకు , ప్రభుత్వానికి ఉపశమనం కలిగించాయి.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 70 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4487కు చేరింది. ఇక యాక్టివ్ కేసుల విషయానికి వస్తే.. 97,932 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,04,074 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే.. అనంతపురంలో 584, చిత్తూరులో 875, తూర్పు గోదావరిలో 1312, గుంటూరులో 765, కడపలో 447, కృష్ణాలో 193, కర్నూలులో 316, నెల్లూరులో 949, ప్రకాశంలో 419, శ్రీకాకుళంలో 559, విశాఖలో 405, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరిలో 950 కేసులు నమోదయ్యాయి.