తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం కరోనా బైర్నే పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కరోనా బారినపడగా..తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది.
ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. కరోనావైరస్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో టెస్టులు చేయించుకున్నట్లు చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రిపోర్టులు వచ్చాయని అయితే పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆయన తెలిపారు. ఈ వార్త తెలిసిన పార్టీ నేతలు , కార్య కర్తలు అంత హరీష్ క్షేమం కోసం సోషల్ మీడియా లో ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ గెట్ వెల్ సూన్ బావ అంటూ ట్వీట్ చేయగా..కవిత సైతం హరీష్ క్షేమం కోసం ట్వీట్ చేసారు. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… మా ప్రార్థనలన్నీ మీతోనే ఉన్నాయి బావా అని పేర్కొన్నారు. తిరుగులేని మీ సంకల్పశక్తితో కరోనా వైరస్‌ను ఓడించి అతిత్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు .
All our prayers are with you Bava. With your resolute will power, you will soon come out of this and defeat Coronavirus. https://t.co/pwq17kGCM4— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 5, 2020