బాలయ్యకు మళ్ళీ ఇద్దరా ?

balakrishan-asin-nayanఅప్పుడెప్పుడో రవిచావలి దర్శకత్వంలో వచ్చి అభిమానులకు నిరాశ మిగిల్చిన శ్రీమన్నారాయణ చిత్రం తర్వాత ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ ముఖానికి మేకప్‌ వెయ్యలేదు. ఏ ఒక్క చిత్రం కూడా ఓకే చెయ్యలేదు అనుకుంటున్న తరుణంలో బోయపాటి శీను దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ ఓకే అయిందన్న వార్తలు నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి. అందునా ఈ చిత్రం టైటిల్‌ ‘ రూలర్‌ ‘ అని తెలియగానే ఆ పేరులోని పవర్‌ కు బాలయ్య స్టామినా తోడయితే అదుర్స్‌.. అంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. 2014 లో రాబోతున్న సాధారణ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలయ్య అడుగుపెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించడం మరో సంతోషకరమైన వార్త. రూలర్‌ చిత్రం కూడా పూర్తిగా రాజకీయం బ్యాక్‌ డ్రాప్‌ లో ఉండబోతుందని కూడా తెలిసింది. ఈ చిత్రం బాలయ్య పొలిటికల్‌ కెరియర్‌ కు, తెలుగుదేశం పార్టీకి మంచి సపోర్ట్‌ గా నిలవాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను 2014 సంవత్సరం జనవరిలో విడుదల చేసే విధంగా షెడ్యూల్‌ చేస్తున్నట్టు సమాచారం. మెల్లమెల్లగా ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన ఇద్దరు అందగత్తెలు ఉండబోతున్నట్టు తాజాగా తెలిసింది. అంటే ఇదేదో ఇదివరకు బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ లో వచ్చిన సింహా లానే ఉండబోతుందా అన్న అనుమానాలు వచ్చేలా అనిపిస్తోంది. సింహాలానే ఇందులో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తారా? అదీ తండ్రీకొడుకులుగానేనా? అని ఇప్పటికే అభిమానులు తమలో తాము చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ ఇద్దరిలో బాలయ్య సరసన అసిన్‌ ఒక కథానాయికగా నటించడం దాదాపుగా ఖరారయిపోయినట్టే అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి రెండవ హీరోయిన్‌ గా బాలయ్యకు మంచి జోడీగా అభిమానులే కాకుండా బాలయ్య కూడా భావించే నయనతార ఉండొచ్చేమో! అంటే బాలకృష్ణ, నయనతార, అసిన్‌ కాంబినేషన్‌ లో బోయపాటి శీను రూలర్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టేనా?