తెలంగాణ తాజా కరోనా హెల్త్ బులిటిన్ ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు రెండు వేలకు పైగానే కేసులు నమోదు అవుతూ , పదుల సంఖ్య లో మరణాలు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు.ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11మంది ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 877కి చేరింది.

జిల్లావారిగా కొత్తగా నమోదు అయినా కేసులు చూస్తే.. జీహెచ్ఎంసీలో 305 నమోద‌వ‌గా, రంగారెడ్డి జిల్లాలో 184, న‌ల్ల‌గొండ‌లో 170, క‌రీంన‌గ‌ర్‌లో 150, ఖ‌మ్మంలో 142, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 134, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 96, సూర్యాపేట‌లో 96, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 93, నిజామాబాద్‌లో 93, జ‌గిత్యాల‌లో 85, సిద్దిపేట‌లో 80, యాదాద్రి భువ‌న‌గిరిలో 78, మంచిర్యాల‌లో 73, రాజ‌న్న‌సిరిసిల్ల‌లో 72, సంగారెడ్డిలో 70, పెద్ద‌ప‌ల్లిలో 65, కామారెడ్డిలో 60,

మ‌హ‌బూబాబాద్‌లో 58, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 48, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 42, మెద‌క్‌లో 42, వ‌న‌ప‌ర్తిలో 40, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 36, జ‌న‌గామ‌లో 35, నిర్మ‌ల్‌లో 31, జోగులాంబ గ‌ద్వాలలో 27, ఆదిలాబాద్‌లో 23, జ‌య‌శంక‌ర్‌ వికారాబాద్‌లో 19, ములుగులో 18, ఆసిఫాబాద్ జిల్లాలో 16, నారాయ‌ణ‌పేట‌లో 16, భూపాల‌ప‌ల్లిలో 12 కేసుల చొప్పున ఉన్నాయి.