రష్యాకు రాష్ర్ట మంత్రులు !

ap-ministers-rassia-tourరాష్ట్రానికి చెందిన ఐదుగురు మంత్రులతో పాటు డిజిపి రష్యా పర్యటనకు వెళ్ళారు. మంత్రుల అయిదు రోజుల రష్యా పర్యటనకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుమతిని ఇవ్వగా, కేంద్రం నుండి ఇంకా అనుమతి రాకముందే మంత్రులు రష్యాకు పయనమయ్యారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాసు వెంకట్ కృష్ణారెడ్డి, టిజి వెంకటేశ్, విశ్వరూప్, డిజిపి దినేష్ రెడ్డిలు రష్యాకు వెళ్లేవారిలో ఉన్నారు. వీరు అయిదురోజుల పాటు రష్యా, శీతల ప్రాంతమయిన ఉక్రెయిన్ లలో పర్యటించనున్నారు. కాగా, విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి వంటి వేసవి సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే బాధ్యత గల అయిదుగురు మంత్రులు ఇవేవి పట్టించుకోకుండా మూకుమ్మడిగా వేసవి విడిది కోసం విదేశాలకు పయనమవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా పర్యటనలో ఉన్న గంటా శ్రీనివాస రావు పెట్టుబడులు, మౌళిక వసతుల శాఖ మంత్రి.రాష్ర్టానికి గ్యాస్ కొరతతో విద్యుదుత్పత్తి స్తంభించింది. ఈ సమయంలో.. ఆ శాఖ మంత్రిగా అదనపు గ్యాస్ సాధించేందుకు శ్రీనివాస రావు కృషి చేయాలి. అలాగే.. విశ్వరూప్ ది పశువర్థక శాఖ. ఈ వేసవిలో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఉంది. ఇలా.. రష్యా పర్యటనకు వెళ్ళిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రధానమైన శాఖ అందులో వేసివి కాలం కావడంతో.. రాష్ర్టం ఎన్నో సమస్యలతో అట్టుడికిపోతుంటే రాష్ర్ట మంత్రులు మాత్రం సేద తీరడానికి రష్యా వెళ్ళడం ఏంటని ఇటు ప్రజలు అటు ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నారు.