ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో టెస్ట్ లు చేస్తుండడం తో కేసులు సైతం భారీగా నమోదు అవుతున్నాయి. ప్రతి రోజు పదివేల కేసులు నమోదు అవుతూ వస్తుండగా.. గడిచిన 24 గంటల్లో 10,199 కరోనా కేసులు నమోదు కాగా..75 మంది వైరస్ కారణంగా కన్నుమూశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,65,730కు చేరగా, మృతుల సంఖ్య 4,200కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 103701 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1090, నెల్లూరు జిల్లాలో 982, ప్రకాశం జిల్లాలో 926, కడప జిల్లాలో 898, చిత్తూరు జిల్లాలో 885, అనంతపురం జిల్లాలో 854, పశ్చిమగోదావరి జిల్లాలో 836, గుంటూరు జిల్లాలో 805, శ్రీకాకుళం జిల్లాలో 717, విశాఖపట్నం జిల్లాలో 695, కర్నూలు జిల్లాలో 616, విజయనగరం జిల్లాలో 577, కృష్ణా జిల్లాలో 318 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 62900 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 46871కు చేరాయి.. అనంతపురం జిల్లాలో 43248 కేసులు ఉన్నాయి.