తెలంగాణ కరోనా తాజా హెల్త్ బులిటిన్ ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు చేరువలో కేసులు నమోదు అవుతూ..పదుల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా హెల్త్ బులిటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,817 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు 1,33,406 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 856కు చేరుకుంది.

ఇక జిల్లాలవారి కేసులు చూస్తే.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 89, జీహెచ్ఎంసీ ప‌రిధిలో 452, జ‌గిత్యాల‌లో 88, జ‌న‌గాంలో 41, జ‌య‌శంక‌ర్ ‌భూపాలప‌ల్లిలో 26, జోగులాంబ గ‌ద్వాల‌లో 33, కామారెడ్డిలో 62, క‌రీంన‌గ‌ర్‌లో 164, ఖ‌మ్మంలో 157, ఆసిఫాబాద్ జిల్లాలో 19, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 42, మ‌హ‌బూబాబాద్‌లో 62, మంచిర్యాల‌లో 71, మెద‌క్‌లో 35, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 129, ములుగులో 18, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 41, న‌ల్ల‌గొండ‌లో 157, నారాయ‌ణ‌పేట‌లో 21, నిర్మ‌ల్‌లో 16, నిజామాబాద్‌లో 97, పెద్ద‌ప‌ల్లిలో 75, రాజ‌న్న‌సిరిసిల్ల‌లో 53, రంగ‌రెడ్డిలో 216, సంగారెడ్డిలో 76, సిద్దిపేట‌లో 120, సూర్యాపేట‌లో 116, వికారాబాద్‌లో 27, వ‌న‌ప‌ర్తిలో 45, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 46, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 114, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో 73 చొప్పున ఉన్నాయి.